Monday, 24 September 2012
"Rebel" Censor Today
ప్రభాస్ 'రెబల్' సెన్సార్ నేడే
హైదరాబాద్ : ప్రభాస్ తాజా చిత్రం 'రెబల్' . ఈ నెల 28 వ తేదీన విడుదల అవుతున్న ఈ చిత్రం పూర్తి మాస్ మసాలా ఎంటర్టైన్మెంట్ గా రూపొందింది. రాఘవ లారెన్స్ స్వయంగా అందించిన ఈ చిత్రం సంగీతం ఇప్పటికే ప్రభాస్ అభిమానులును ఆకట్టుకుంటోంది. అలాగే ఈ చిత్రం పోస్టర్స్,టీజర్స్ సినిమాపై ఆసక్తిని రేపాయి. ప్రభాస్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ గా చెప్పబడుతున్న ఈ చిత్రంపై చాలా అంచనాలు ఉన్నాయి. వరసగా లవ్ స్టోరీలు చేస్తున్న ప్రభాస్ ఈ చిత్రంతో ఛత్రపతి రేంజిలో తన అభిమానులను అలరిస్తానని చెప్తున్నారు.
బ్రతుకు మీద ఆశ లేని వాడే రణ రంగంలో అడుగు పెట్టాలి, యమ పాశం అడుగుదూరంలో ఉన్న చిరునవ్వు చిందాలి, అవకాశం వస్తే మాత్రం లక్ష్యం వైపు దూసుకు పోవాలి, చావుకు మస్కా కొట్టి మన పని మనం చేసుకోవాలి దానికి చాలా తెగువ కావాలి...అలాంటి క్యారెక్టర్ ప్రభాస్ ది రెబెల్ లో అంటున్నారు లారెన్స్. ప్రభాస్,లారెన్స్ కాంబినేషన్ లో తొలిసారిగా రూపొందుతోన్న చిత్రం రెబెల్. ఈ చిత్రంలో డైలాగులకు అత్యంత ప్రాధాన్యత ఉండబోతోందని తెలుస్తోంది. ఇక షూటింగ్ టైమ్ లోనే నాకు మంచి కిక్ ఇస్తున్న సినిమా ఇది. లారెన్స్ ఎక్స్‌ట్రార్డినరీగా తీస్తున్నాడు. నా ఫ్యాన్స్‌కి నచ్చే అంశాలన్నీ ఇందులో ఉంటాయి.ఇందులో నా లుక్ డిఫరెంట్‌గా ఉంటుంది. టైటిల్‌కి తగ్గట్టుగా స్టైలిష్‌గా, పక్కా మాస్‌గా ఉంటుందీ సినిమా అని ప్రభాస్ చెప్తున్నారు.
దర్శకుడు లారెన్స్ మాట్లాడుతూ...‘రెబల్' అనే టైటిల్ మాత్రమే కాదు. కథ కూడా ప్రభాస్ కోసమే అన్నట్టుగా ఉంటుంది. ప్రభాస్ కెరీర్‌లో మాస్ ప్రేక్షకులను ఎక్కువగా ఆకట్టుకున్న సినిమా ‘ఛత్రపతి'. ఆ సినిమాను మించే స్థాయిలో మా ‘రెబల్' ఉంటుంది అన్నారు. నిర్మాతలు జె.భగవాన్, జె.పుల్లారావు మాట్లాడుతూ -‘‘డార్లింగ్, మిస్టర్ పర్‌ఫెక్ట్ లాంటి విజయాల తర్వాత వస్తున్న ప్రభాస్ సినిమా ఇది. తప్పకుండా ఈ సినిమా ప్రభాస్‌కి హ్యాట్రిక్ హిట్‌గా నిలుస్తుంది. తమన్నా, దీక్షాసేథ్ గ్లామర్ ఈ చిత్రానికి అదనపు ఆకర్షణ. ఏ విషయంలోనూ రాజీ పడకుండా లారెన్స్ అద్భుతంగా ఈ సినిమాను తీర్చిదిద్దారు. ప్రభాస్ కెరీర్‌లోనే ‘రెబల్' హై బడ్జెట్ ఫిలిం అవుతుంది'' అని చెప్పారు.
ప్రభాస్ సరసన తమన్నా, దీక్షాసేథ్ నటిస్తున్న ఈచిత్రంలో రెబల్ స్టార్ కృష్ణం రాజు ఓప్రత్యేక పాత్ర పోషిస్తున్నారు. ముఖేష్ రుషి, బ్రహ్మానందం, అలీ, ఎంఎస్ నారాయణ, ప్రభ, హేమ, సన, రజిత, ముంబయి విలన్స్ శంకర్, విశాల్, ఆకాష్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి మాటలు: డార్లింగ్ స్వామి, ఫోటో గ్రఫీ: సి. రాంప్రసాద్, ఎడిటింగ్: మార్తాండ్ కె. వెంకటేష్, ఫైట్స్: రామ్ లక్ష్మణ్, ఆర్ట్: ఎ.ఎస్. ప్రకాష్, ప్రొడక్షన్ కంట్రోలర్: బెజవాడ కోటేశ్వరరావు, కో-డైరెక్టర్స్: బుజ్జి, కిరణ్, నిర్మాతలు: జె. భగవాన్, జె. పుల్లరావు, కథ-స్ర్కీన్ ప్లే-కొరియోగ్రఫీ-సంగీతం-దర్శకత్వం: రాఘవ లారెన్స్.
Subscribe to:
Posts (Atom)